KTR: కేటిఆర్ తక్కువ అంచనా వేసారా…? గేమ్ చేంజ్ అయిందక్కడే…!

ఫార్ములా ఈ కార్ రేసింగ్ విషయంలో కేటీఆర్ (KTR) ను ఏసీబీ అధికారులు దాదాపు అరెస్టు చేసినంత పని చేశారు. ఆయనను కచ్చితంగా అరెస్టు చేసే అవకాశం ఉందని చాలామంది అంచనా వేశారు. హైకోర్టుకు వెళ్లి అరెస్టు కాకుండా కేటీఆర్ తప్పించుకున్నారు. దీనితో పది రోజులు పాటు ఆయనను అరెస్టు చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేటీఆర్ విషయంలో ఎలా వ్యవహరించబోతుంది అనేదే ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి తెలంగాణలో బలపడాలి అని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ ఈ క్రమంలో గులాబీ పార్టీని బలి చేయాలి అనే ప్లాన్ రెడీ చేసుకుని ఎంటర్ అవుతోంది.
వాస్తవానికి కాంగ్రెస్ పార్టీని ఖతం చేయాలని అప్పట్లో భారతీయ జనతా పార్టీ (BJP) అలాగే కేసిఆర్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేసినా రేవంత్ రెడ్డి (Revanth reddy) పుణ్యమా అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు క్రమంగా గులాబీ పార్టీని అణిచివేయాలి అనే వ్యూహంలో కమలం పార్టీ పెద్దలు ఉన్నారనే ఒపీనియన్ వినపడుతోంది. తెలంగాణలో ఎలాగైనా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అనేది కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహం. అందుకు తగినట్టుగానే తెలుగుదేశం పార్టీని కూడా తెలంగాణలో వాడుకోవడానికి రెడీ అయ్యారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమయంలోనే పొత్తును కూడా తెలంగాణలో అధికారికంగా ప్రకటించి పోటీ చేయనున్నారు. అటు జనసేన పార్టీ కూడా ఇక్కడ భాగం కానుంది. ఈ తరుణంలో భారత రాష్ట్ర సమితిని ఎంతవరకు కంట్రోల్ చేస్తారనేదే ఇక్కడ ప్రధాన ప్రశ్న. అయితే కేటీఆర్ ను అరెస్టు చేస్తారని వార్తలు వచ్చిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రంగంలోకి దిగింది. కేటీఆర్ పై నమోదు చేసిన కేసుల వివరాలు అలాగే జరిగిన బ్యాంకు లావాదేవీలు సహా ఎఫ్ఐఆర్ కాపీని పూర్తిగా తమకు లేఖ ద్వారా పంపాలని కోరింది.
దీనితో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎంటర్ అయిందనే క్లారిటీ చాలామందికి వచ్చేసింది. కచ్చితంగా కేటీఆర్ భవిష్యత్తులో ఇబ్బంది పడనున్నారని, ఇప్పటికే కవిత ద్వారా గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టిన కమలం పార్టీ పెద్దలు ఇప్పుడు కేటీఆర్ ద్వారా కూడా పార్టీని మానసికంగా దెబ్బతీసే వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉండవచ్చు అనే ఒపీనియన్ వినపడుతోంది. సాధారణంగా తన అరెస్టుని సెంటిమెంట్ గా వాడుకోవాలని కేటీఆర్ ముందు నుంచి భావించారు. కానీ ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావడంతో కేటీఆర్ లో ఒకరకంగా భయం మొదలైంది.
ఈ విషయాన్ని ముందే ఊహించి ఆయన హైకోర్టుకు వెళ్లినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ముందు గవర్నర్ అనుమతి ఇవ్వడం వెనుక కచ్చితంగా కేంద్ర పెద్దల హస్తం ఉందనే అభిప్రాయం కూడా వినపడుతోంది. ఇవన్నీ కేటీఆర్ కు ఆలస్యంగా అర్థమయ్యే అని అందుకే ఆయన జాగ్రత్త పడ్డారని అంటున్నారు. కాని ఇక్కడ ఈడీ ఎంటర్ కావడం ఈసీఆర్ నమోదు చేయడం కేటిఆర్ అసలు ఊహించలేదు. అయితే పదే పదే రేవంత్ రెడ్డిని దమ్ముంటే తన అరెస్టు చేయాలని రెచ్చగొట్టడం కేటీఆర్ కు మైనస్ అయింది.
ఒక్కసారి కేటీఆర్ జైలుకు వెళితే కచ్చితంగా భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతినే అవకాశం ఉంది. కేసిఆర్ ఎలాగో బయటకు రావటం లేదు. కాబట్టి ఖచ్చితంగా పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం కూడా ఉండవచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.