హైదరాబాద్ సెయిలింగ్ వీక్ ఆరంభం

ప్రతిష్టాత్మక హైదరాబాద్ సెయిలింగ్ వీక్ పోటీలు ఘనంగా మొదలయ్యాయి. హుస్సేన్‌సాగర్ వేదికగా జరుగుతున్న 38వ ఎడషన్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి సీనియర్ కల్నల్ కమాండెంట్, లెఫ్ట్‌నెంట్ జనరల్ జేఎస్ సిదానా హాజరయ్యారు. ఐఎల్‌సీఏ 7, ఐఎల్‌సీఏ 6, ఐఎల్‌సీఏ 4 విభాగాలలో పోటీలు జరుగుతాయి. ఈ ఏడాది జరిగే పోటీలు సెయిలర్లకు యాచింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (వైఏఐ) ర్యాంకింగ్ ఈవెంట్‌గా ఉపయోగపడనున్నాయి.