Shamshabad: శంషాబాద్ నుంచి ఏపీకి వెళ్లాల్సిన విమానాలు రద్దు
మొంథా తుపాను ప్రభావం నేపథ్యంలో శంషాబాద్ (Shamshabad) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు వెళ్లాల్సిన 18 విమాన సర్వీసులు రద్దయ్యాయి. వాతావరణం అనుకూలించని కారణంగా హైదరాబాద్ (Hyderabad) నుంచి విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరానికి వెళ్లాల్సిన విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం నుంచి శంషాబాద్ రావాల్సిన 17 విమాన సర్వీసులను కూడా రద్దు చేసినట్లు చెప్పారు. రద్దయిన వాటిలో విశాఖపట్నం నుంచి 9, రాజమహేంద్రవరం నుంచి 5, విజయవాడ నుంచి 3 విమానాలు ఉన్నాయి.







