Jagan: ఇకనైనా జగన్ స్ట్రాటజీ మారుతుందా?

రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో చెప్పడం చాలా కష్టం. అందుకే ప్రజల మనసును గెలుచుకోవాలంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి. తెలుగుదేశం పార్టీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఈ విషయం బాగా అర్థం చేసుకున్న నాయకుడు. ఆయన ప్రతి ఎన్నికలో ప్రజల ముందుకు కొత్తగా వస్తారు. అనేకసార్లు తన పార్టీలో కొత్త వాగ్ధానాలు, నినాదాలతో పాటు, రాజకీయ ఒప్పందాలు చేసి విజయం సాధించారు.
1999 ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ (BJP)తో కూటమి చేసి, దేశ భద్రత అనే అంశం మీద ప్రచారం చేశారు. 2004లో ఆయనపై జరిగిన మావోయిస్టుల (Maoist) దాడి తర్వాత, రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని ప్రధానంగా వినిపించారు. 2009లో “ఆల్ ఫ్రీ” నినాదంతో అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ప్రయత్నించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విడిపోయిన తరువాత, మోడీ (Modi)తో కలసి నవ్యాంధ్ర నిర్మాణం అనే అజెండాతో ముందుకొచ్చారు. 2019లో అమరావతి (Amaravati) రాజధాని అభివృద్ధిని ప్రధానంగా చెప్పుకున్నారు. ఇక 2024 ఎన్నికల నాటికి రాష్ట్రాన్ని తిరిగి పునర్నిర్మించాలన్న ఆశయంతో ప్రజల వద్దకి వెళ్లారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) విషయానికి వస్తే, మొదట్లో జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) గారి రాజకీయ ప్రయాణం వైఎస్సార్ (Y. S. Rajasekhara Reddy) గారి స్ఫూర్తితో ప్రజలలో నమ్మకం కలిగించింది. 2019లో ఆయనకు జనం ఓటేయడానికి ఆయన మీదున్న ఆసక్తి, ఆశలు కూడా కారణం అయ్యాయి. కానీ అదే ఆసక్తి 2024లో ఉండదని అప్పట్లోనే చాలామంది విశ్లేషిస్తున్నారు. జగన్ గారి మాటల్లో, వైఖరిలో పెద్దగా మార్పులు కనిపించకపోవడం, ఆయన స్పీచులు అదే తరహాలో ఉండిపోవడం ప్రజలకు విసుగు తెచ్చినట్లు అనిపిస్తోంది. అయితే జగన్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం 2024 ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపించింది.
రాజకీయాలు అనేవి స్థిరంగా ఉండే వ్యవస్థ కాదు. ప్రతి ఎన్నికలో ప్రజల మూడ్, ఆశయాలు మారిపోతుంటాయి. వాటికి తగినట్లుగా ప్రణాళికలు వేసుకుని, ప్రజలను ఆకట్టుకునే విధంగా వ్యూహాలు రూపొందించాలి. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకున్నారు. ప్రజలే అధికారం ఇచ్చేవారు. వారిని తప్పకుండా ఓటు వేయించాలంటే వారి అవసరాలపై దృష్టి పెట్టాలి. మళ్లీ మళ్లీ బాబును తప్పుబట్టడం కంటే తమ అజెండాను ముందుకు తెచ్చేలా చూడాలి. ప్రజాస్వామ్యంలో విజయం పొందాలంటే ప్రజల మన్ననతో పాటు, వారికి జవాబుదారీగా ఉండే తత్వం అవసరం.
ఇక వైసిపి నేతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రజలకు చేసిన మేలు కంటే కూడా ప్రతిపక్షాలను తిట్టడం పైనే వీళ్లు ఎక్కువ కాన్సెంట్రేట్ చేశారు. మరి ఇప్పుడు జైల్లో, కేసులు అంటూ తిరుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలి అంటే జగన్ తన ప్రణాళికలలో తీసుకురావడమే కాకుండా ప్రజలకు తన పట్ల స్పష్టత ఏర్పడేలా జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. మరి జగన్ నెక్స్ట్ పొలిటికల్ స్ట్రాటజీ ఏమిటి అనే దానిపై సర్వత్ర ఆసక్తి నెలకొంది..