Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!

సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమాతో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్(Venkatesh). ప్రస్తుతం ఆయన తన తర్వాతి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా, అక్టోబర్ 6 నుంచి వెంకీ త్రివిక్రమ్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
త్రివిక్రమ్(trivikram) సినిమాతో పాటూ వెంకటేష్ మరో సినిమాను కూడా చేయనున్నారు. అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా తెరకెక్కుతున్న మన శంకరవరప్రసాద్ గారు(Mana Sankaravaraprasad Garu) మూవీలో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. చిరూ(chiru)- అనిల్ రావిపూడి(anil ravipudi) మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా త్వరలోనే ఈ సినిమా షూటింగ్ లో వెంకీ జాయిన్ అవనున్నారని మేకర్స్ తెలిపారు.
తాజా సమాచారం ప్రకారం, అక్టోబర్ 20 నుంచి వెంకటేష్, మన శంకరవరప్రసాద్ గారు షూటింగ్ లో జాయిన్ కానున్నారని, ముందు వెంకీ(Venky), చిరూ(chiru) కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో స్పెషల్ గా భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. నయనతార(Nayanthara) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో(Bheems Ciciroleo) మ్యూజిక్ అందిస్తున్నారు.