Ireland :ఐర్లాండ్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
దక్షిణ ఐర్లాండ్ ప్రాంతంలో ఉన్న కార్లో కౌంటీలో చెట్టును కారు ఢీ కొని ఇద్దరు తెలుగు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గండ్రాయి గ్రామానికి చెందిన చిట్టూరి భార్గవ్ (Chitturi Bhargav )గా, పల్నాడు జిల్లా రొంపిచర్ల పడమటి పాలేనికి చెందిన చెరుకూరి సురేశ్ చౌదరి(Suresh Chowdhury )గా గుర్తించారు. జనవరి 31 శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగిందని స్థానిక పోలీసు అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన యువకుడిని, యువతిని కిల్కెన్నిలోని సెయింట్ లూక్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబాలకు అందుబాటులో ఉన్నామని డబ్లిన్(Dublin)లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ప్రమాదానికి గురైన నలుగురు స్నేహితులు కార్లో లోని సేతు ( సౌత్ ఈస్ట్ టెక్నొలాజికల్ యూనివర్సిటీ) విశ్వవిద్యాలయం విద్యార్థులు. నలుగురూ ఒకే ఇంట్లో ఉంటున్నారని అధికారులు తెలిపారు.






