TDP vs YCP: సీట్ల పునర్విభజనపై టీడీపీ–వైసీపీ వ్యూహాలు.. లాభం ఎవరిదో?

ఏపీలో (Andhra Pradesh) అసెంబ్లీ సీట్ల పెంపు చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం రాష్ట్రానికి ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను దాదాపు యాభై వరకూ పెంచే అవకాశం ఉంది. ఈ నిర్ణయం అమలయితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశముంది. రాజకీయ విశ్లేషకుల మాట ప్రకారం, ఇది అధికారంలో ఉన్న టీడీపీ (TDP) కూటమికి అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (United Andhra Pradesh) లో 2009లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి (Y. S. Rajasekhara Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ సీట్ల పునర్విభజనను తమ పార్టీకి అనుకూలంగా చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో టీడీపీ కూడా ఇదే అవకాశాన్ని వాడుకోవచ్చని అనేక అంచనాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాలను విభజించి, తమ ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2027 మార్చి 1న జనాభా గణన (Population Census) పూర్తవుతుంది. అదే సమయంలో కులాల గణన కూడా జరుగుతుంది. దీనివల్ల రాష్ట్రంలోని సామాజిక నిర్మాణం స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఈ గణాంకాల ఆధారంగా సీట్ల పునర్విభజన జరగనుంది. రాజకీయ పార్టీలు తమ బలహీన ప్రాంతాలను బలోపేతం చేసుకునేందుకు, బలమైన ప్రాంతాలను వ్యూహాత్మకంగా మళ్లించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
రాయలసీమ (Rayalaseema) ప్రాంతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) గట్టిన అధికారం ఉన్న ప్రాంతంగా భావించబడుతుంది. దాంతో ఆ ప్రాంతంలో సీట్ల పునర్విభజన ద్వారా టీడీపీ వైసీపీ బలాన్ని తగ్గించేందుకు వ్యూహాలు రచించనుందని అంటున్నారు. సామాజిక వర్గాల శాతం ఆధారంగా కొన్ని నియోజకవర్గాలను పక్కనున్న ప్రాంతాల్లో విలీనం చేస్తే, వైసీపీకి ఉన్న ఆధిక్యత సద్దుమణగే అవకాశం ఉంది. అదే విధంగా టీడీపీకి బలం ఉన్న ప్రాంతాల్లో కొత్త నియోజకవర్గాలు ఏర్పడితే ఆ పార్టీకి మరింత బలం చేకూరుతుంది.
ఇంకా, అసెంబ్లీ సీట్ల పెంపుతో రాజకీయ ఆశావహులకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. కూటమి పార్టీలు కొత్త నేతలను తీసుకురావచ్చు. వైసీపీ కూడా ఎక్కువ మందికి టికెట్లు ఇచ్చేలా వ్యూహాలు రచించవచ్చు. అయితే మొత్తం మీద పునర్విభజన ఎలా జరిగితేనేం, ప్రజల్లో ఏ పార్టీపై నమ్మకం ఎక్కువగా ఉందో, అదే ఫలితాలను ప్రభావితం చేస్తుందనేది రెండు పార్టీల నమ్మకం.