వైఎస్ జగన్ తప్పుకుని… చంద్రబాబుకు బాధ్యత

ముఖ్యమంత్రి పదవి నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వారం రోజులు తప్పుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు బాధ్యత అప్పగిస్తే కరోనా నుంచి రాష్ట్రాన్ని ఎలా గట్టెక్కించాలో చేసి చూపిస్తారని తెలుగుదేశం పార్టీ నేత పట్టాభి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. వారంపాటు అధికారం అప్పగిస్తే చంద్రబాబు సైట్‍రైట్ చేస్తారన్నారు. దమ్ముంటే వారం రోజులు జగన్ తప్పుకోవాలని అన్నారు. హుద్‍హుద్ తుపాను, ఉత్తరాఖండ్ వరదల సమయంలో చంద్రబాబు ఏ విధంగా సేవలందించారో ప్రజలు చూశారన్నారు. విపత్తు వచ్చినపుడు సమర్థంగా ఎలా ఎదుర్కోవాలి ప్రజలు ఏ విధంగా కాపాడాలో ఆయన చేసిన చూపిస్తారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే పరిస్థితులు మరింత దిగజారేవంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు.