Srilakshmi : ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి పిటిషన్‌పై ..సుప్రీంకోర్టులో

ఓబుళాపురం అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (Srilakshmi) పిటిషన్‌పై సుప్రీంకోర్టు (Supreme Court ) లో విచారణ జరిగింది. అక్రమ మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి పేరును తొలగిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను సుప్రీంకోర్టులో సీబీఐ (CBI) సవాల్ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం కేసులో మరోసారి వాదనలు విని నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు (High Court ) కు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాదనల అనంతరం ఇటీవల హైకోర్టు తీర్పు వెలువరించింది. శ్రీలక్ష్మి పేరును తొలగించడం కుదరదని, ఆమె దాఖలు చేసిన పిటిషన్ (petition ) ను కొట్టేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.