శశికాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 రక్షణ పరికరాల పంపిణీ
తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ 19 వైరస్ బారి నుంచి ప్రజలను రక్షించేందుకు విదేశాంధ్రుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి, హైదరాబాద్ క్యూహబ్ వ్యవస్థాపకుడు వల్లేపల్లి శశికాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో వివిధ వర్గాలవారికి 20వేలకు పైగా కోవిడ్ 19 వైరస్ నిరోధక సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను పంచారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు, న్యాయవాదులకు, వృద్ధులకు, డాక్టర్లకు వీటిని పంపిణీ చేశారు. మిగిలిన వాటిని బలహీన వర్గాల వారికి అందజేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు అందజేశారు.






