రాష్ట్ర ప్రభుత్వ పరధిలో లేని అంశాలపై….టీడీపీ

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశాలపై విమర్శలు చేయడం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తగదని ఆంధప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత బాధ్యతాయుత నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలని సూచించారు. కొవిడ్‍పై పోరులో ప్రభుత్వం పరిధిలో ఉన్న బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తోందని స్పష్టం చేశారు. సరిపడా టీకా నిల్వలు ఉండాలనే కానీ, అన్ని రాష్ట్రాల కన్నా వేగంగా వ్యాక్సినేషన్ పక్రియను పూర్తి చేసే వ్యవస్థ ఆంధప్రదేశ్‍లో ఉందని అన్నారు. ఒక్క రోజులో 6 లక్షలకు పైగా టీకా డోసులు వేసిన రాష్ట్రం ఆంధప్రదేశ్ అని గుర్తు చేశారు. రాష్ట్రానికి టీకాలు చేరుకున్నప్పటి నుంచి వ్యాక్సినేషన్ పక్రియ ముగిసేంత వరకు అధికారులు, ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది సమన్వయంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.