Jagan: పొదిలిలో జగన్ పర్యటనలో ఉద్రిక్తత.. కాన్వాయ్ పై దాడి చేసిన మహిళలు..

ప్రకాశం జిల్లా (Prakasam district) లో జరిగిన జగన్ (Jagan) పర్యటన ఉద్రిక్తతలకు వేదికగా మారింది. బుధవారం పొదిలి (Podili) ప్రాంతానికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అక్కడి పొగాకు రైతులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే, ఇటీవల Sakshi TV లో ఒక వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో విమర్శలకు గురవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆ వ్యాఖ్యలపై మహిళలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే నాలుగు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నిరసనలు కొనసాగుతున్నాయి. “అమరావతి” (Amaravati) రాజధాని విషయంలో చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం ఆందోళనకారులను మరింత ఉద్రిక్తానికి దారి తీసింది. ముఖ్యంగా సాక్షి టీవీ (Sakshi TV) యజమానిగా ఉన్న జగన్ స్వయంగా మాఫీ చెప్పాలని, మహిళల మనోభావాలను గౌరవించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కానీ జగన్ గానీ, భారతి (Bharathi) గానీ స్పందించకపోవడంతో అసంతృప్తి మరింత గట్టిగా వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో పొదిలికి వచ్చిన జగన్ కాన్వాయ్ కు వ్యతిరేకంగా అక్కడి మహిళలు నిరసన చేపట్టారు. వారు నల్ల బెలూన్లు గాలిలోకి ఎగురవేసి తమ అభ్యంతరాన్ని తెలియజేశారు. అలాగే, “జగన్ గో బ్యాక్ (Jagan Go Back)”, “జగన్ క్షమాపణ చెప్పాలి (Jagan Apologize) ” వంటి నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నిరసన కాస్త అనూహ్యంగా దాడులకు దారి తీసింది.. వైసీపీ కార్యకర్తలు నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేయగా, కొందరు మహిళలు చెప్పులు, రాళ్లు విసిరారు. కొన్ని చెప్పులు జగన్ కాన్వాయ్ పై పడినట్టు సమాచారం.
పోలీసులు పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించారు ..అయితే, వైసీపీ కార్యకర్తల కూడా రాళ్లు విసరడంతో క్రమంలో ఓ కానిస్టేబుల్ కు రాయి తగిలి గాయమైంది. దీంతో పొదిలి ప్రాంతంలో ఉద్రిక్తత పెరిగింది. అయినప్పటికీ జగన్ రైతులతో సమావేశం కొనసాగించారు.ఈ ఘటనలో మరోసారి ప్రభుతంపై మహిళల ఆవేదన, ఆగ్రహం స్పష్టంగా బయటపడింది. ప్రజా నేతగా జగన్ బాధ్యతగా స్పందించాలని వారు ఆశిస్తున్నారు.