Chandrababu: ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు మేం అభ్యంతరం చెప్పలేదు: చంద్రబాబు
నల్లమలసాగర్ ప్రాజెక్టుతో ఎవరికీ నష్టంలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. సచివాలయం లో కార్యదర్శులు, హెచ్వోడీల తో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కాళేశ్వరం (Kaleshwaram) ఎగువన ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఆ ప్రాజెక్టు కడితే మేం అభ్యంతరం చెప్పలేదు. మిగులు జలాలు ఉన్నాయన్న ఉద్దేశంతో వదిలేశాం. ఇప్పుడు కట్టే ప్రాజెక్టు దిగువ నీటికి సంబంధించినది. ఎగువన తెలంగాణ (Telangana) వాడుకున్న తర్వాతే నీళ్లు కిందకు వస్తాయి. అవసరమైతే శ్రీశైలం (Srisailam), నాగార్జునసాగర్ల నుంచి నీటిని తెలంగాణ, రాయలసీమ వినియోగించుకోవచ్చు. దిగువ నీటిని ఏపీ వాడుకుంటే తెలంగాణకు ఎలా నష్టం? 87శాతం పోలవరం పనులు పూర్తయ్యాయి. 2026 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తాం అని తెలిపారు.






