Kurnool Accident: బస్సు ప్రమాదంపై పీఎం మోడీ, ప్రెసిడెంట్ ముర్ము దిగ్భ్రాంతి
కర్నూలు బస్సు ప్రమాదంపై (Kurnool Accident) ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Droupadi Murmu), ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్ బస్సులో మంటలు చెలరేగి, పలువురు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఆమె.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం తనను కలచి వేసిందన్నారు. తాను బాధిత కుటుంబాల గురించే ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఈ కష్టకాలంలో వారికి అండగా ఉండేందుకుగాను, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని మోడీ (PM Modi) ప్రకటించారు.






