Balakrishna : ఈ ఘటన యావత్ జాతిని.. దిగ్భ్రాంతికి గురిచేసింది : బాలకృష్ణ

గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం(Plane crash) ఘోర దుర్ఘటన మాటలకందని విషాదమని ప్రముఖ సినీహీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. ఈ ఘటన యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఘోర ప్రమాదంలో భారతీయుల (Indians) తో పాటు విదేశీయులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రయాణికులతో పాటు సిబ్బంది (Staff) , విమానం కూలిన చోట మరికొందరు ప్రాణాలు కోల్పోవడం మనసుని కలచివేస్తోందని పేర్కొన్నారు. ఈ జాతీయ విపత్తులో ప్రతి ఒక్కరూ కేంద్రానికి బాసటగా నిలుద్దామంటూ పిలుపునిచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.