Simhachalam: సింహాచలం ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్భ్రాంతి

సింహాచలం ఆలయం వద్ద జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Draupadi Murmu) , ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధి (National Relief Fund) నుంచి పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు.