Nara Lokesh : నిర్మలా సీతారామన్‌తో మంత్రి లోకేశ్ భేటీ

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) న్యూఢల్లీిలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు (Happy birthday) తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉదారంగా ఆర్థిక సాయం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పనుల పురోగతిని వివరించిన లోకేశ్, ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రాజెక్టుల (New projects) కు సహకారం అందించాల్సిందిగా నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.