Nara Lokesh: ఓమియం సిఎస్ టిఓ చొక్కలింగంతో మంత్రి లోకేష్ భేటీ
ఏపీ లో ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయండి
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): ఎలక్ట్రోలైజర్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ కాంట్రాక్ట్ సేవలు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అవసరమైన ఎలక్ట్రోలైజర్లను తయారుచేసే అంతర్జాతీయ సంస్థ ఓమియం (Ohmium) ఛీఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫీసర్ చొక్కలింగం కరుప్పయ్యతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ లోని ఇండస్ట్రియల్ జోన్ లలో (కృష్ణపట్నం లాంటి) ఎలక్ట్రోలైజర్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయండి. ఏపీలో సౌర/పవన సామర్థ్యంతో నడిచే పైలట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్లను సహ-అభివృద్ధి చేయడంతోపాటు సరఫరా పరిశ్రమలు, రవాణా, అమ్మోనియా ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు.
ఓమియం సిఎస్ టిఓ చొక్కలింగం మాట్లాడుతూ… తమ సంస్థ బెంగుళూరులో ప్రపంచంలోనే అతిపెద్ద గిగావాట్ ఎలక్ట్రో లైజర్ ఫ్యాక్టరీని నిర్వహిస్తోందని చెప్పారు. నార్త్ అమెరికా, యూరోప్, ఇండియా, మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇండస్ట్రియల్, ఎనర్జీ, యుటిలిటీ సెక్టార్లలో సేవలందిస్తున్నామని చెప్పారు. భారత్, యుఎస్ కేంద్రాల నుండి ప్రోటాన్-ఎక్స్ఛేంజ్ మెమ్బ్రేన్ (PEM) సాంకేతికత, ఎఫిషియన్సీ ఆప్టిమైజేషన్, ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ సొల్యూషన్స్‌లో ఆవిష్కరణలపై తాము దృష్టిసారించినట్లు చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని చొక్కలింగం చెప్పారు.






