London: నవంబర్ 2 నుంచి లండన్ పర్యటనకు మంత్రి దుర్గేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ (Kandula Durgesh) వచ్చే నెల 2 నుంచి 6 వరకు లండన్ (London)లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే ప్రపంచ ట్రావెల్ మార్కెట్ (డబ్ల్యూటీఎం) 2025లో ఆయన పాల్గొననున్నారు. ఏపీ తరపున స్టాల్ ఏర్పాటు చేసి పర్యాటక రంగం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న కార్యక్రమాలను వివరించనున్నారు. పర్యాటకశాక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ (Ajay Jain) కూడా మంత్రితోపాటు లండన్‌కు వెళ్లనున్నారు. ఈ మేరకు మంత్రి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్) ముఖేశ్‌కుమార్ మీనా(Mukesh Kumar Meena) ఉత్తర్వులు జారీ చేశారు.






