ISRO: కొత్త సంవత్సరాన్ని ‘అన్వేష’తో ప్రారంభించనున్న ఇస్రో.. సర్వం సిద్ధం!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2026 సంవత్సరంలో తన తొలి రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. ఈ నెల 12వ తేదీన ఉదయం 10:17 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి పీఎస్ఎల్వీ-సీ62 (PSLV-C62) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగం ద్వారా ప్రధానంగా ‘ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్’ (EOS-N1)ను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్రహానికే ‘అన్వేష’ (Anvesha) అని నామకరణం చేశారు.
దేశంలో వ్యవసాయం, పట్టణ ప్రణాళిక, పర్యావరణ పర్యవేక్షణ వంటి కీలక రంగాల్లో సేవలు అందించడమే ఈ ‘అన్వేష’ (Anvesha) ఉపగ్రహ ప్రధాన లక్ష్యం. దీనితో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కూడా ఈ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
ఈ మిషన్లో స్పెయిన్కు చెందిన ఒక స్టార్టప్ అభివృద్ధి చేసిన ‘కెస్ట్రెల్ ఇనీషియల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్’ (KID) అనే రీ-ఎంట్రీ వాహనాన్ని కూడా పరీక్షిస్తున్నారు. ఇది కక్ష్యలోకి వెళ్ళిన తర్వాత తిరిగి భూ వాతావరణంలోకి ప్రవేశించి పసిఫిక్ మహాసముద్రంలో పడనుంది. అలాగే పీఎస్ఎల్వీ సిరీస్లో ఇది 64వ ప్రయోగం కావడం విశేషం. గతేడాది మేలో పీఎస్ఎల్వీ-సీ61 విఫలమైన నేపథ్యంలో, ఈ ప్రయోగం ఇస్రోకు (ISRO) అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రస్తుతం శాస్త్రవేత్తలు చివరి దశ తనిఖీల్లో నిమగ్నమై ఉన్నారు.






