వచ్చే నెలలో హ్యాపీనెస్ట్-2 బుకింగ్ లు!

ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ప్రజా నివాసార్థం ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్-2 ప్రాజెక్టు సంబంధించిన ఆన్‌లైన్ బుకింగ్‌లు వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. త్వరలో అనుమతులన్నీ లభించనుండటం సాధ్యమైనంత త్వరగా బుకింగ్‌లు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో ఒకటైన ఐనవోలు వద్ద ఈ ప్రాజెక్టు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడలో నిర్వహించిన హ్యాపీసిటీస్ సదస్సులో ఈ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనప్రాయంగా శంకుస్థాపన జరిపిన సంగతి విదితమే.