ఎపి బడ్జెట్ ఫై ఫ్యాప్సీ ప్రశంసలు…

ఆంధప్రదేశ్‍లో ఫ్రభుత్వం కోవిడ్ సమయంలోనూ రాష్ట్రాన్ని అభివృద్ధిపరచడంలో ముందుంటోందని, అందులో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని సుస్థిరాభివృద్ధి చేసే విధంగా ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫ్యాప్సీ) శ్లాఘించింది. రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనకు రూ.3,673.34 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రం కొత్త పెట్టుబడులను ఆకర్షిస్తుందని ఫ్యాప్సీ అధ్యక్షుడు సీవీ అచ్యుతరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో వైద్యరంగానికి రూ.13,830 కోట్లు కేటాయించడం, ముఖ్యంగా కోవిడ్ కట్టడికి రూ.1,000 కోట్లు ఖర్చు చేయడం ఆహ్వానించదగ్గ నిర్ణయమని ప్రశంసించారు. వ్యవసాయంపై ప్రధానంగా ఆధారపడిన రాష్ట్రంలో ఈ రంగానికి రూ.31,256 కోట్లు కేటాయించడం ద్వారా అన్ని వర్గాలు ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు. ఇలా అన్నీ రంగాలకై తగిన విధంగా కేటాయింపులు జరిపి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు.