Jagan: జగన్ కారు ఘటనపై ఉత్కంఠ.. జూలై 1న హైకోర్టు నిర్ణయం కీలకం

ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y. S. Jagan Mohan Reddy) పాల్నాడు (Palnadu) పర్యటన సమయంలో జరిగిన ఇన్సిడెంట్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనం సృష్టిస్తోంది. సింగయ్య అనే వ్యక్తి జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి మరణించారని ఆరోపణలతో ఈ కేసు నమోదవగా, జగన్‌ను రెండో నిందితుడిగా (A2) చేర్చారు. దీనిపై జగన్ తనపై నమోదైన కేసును రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.
హైకోర్టు (High Court) ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సందర్భంగా, పోలీసులు ఈ కేసులో ముందస్తు చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాల వరకూ ఎలాంటి అరెస్టులు చేయొద్దని చెప్పింది. ఇదే సమయంలో వీడియో ఆధారాల భిన్నతలపై కూడా కోర్టు ఆరా తీసింది. ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతంగా వ్యాపించిన వీడియో పైన ఫోరెన్సిక్ పరీక్షలు చేయించి, ఫోన్ ఐడీ, లొకేషన్‌ను ధృవీకరించి వీడియో నిజమైనదే అని నిపుణులు నివేదిక అందించినట్టు సమాచారం. వీడియో తీసిన క్షణం నుంచి ఆ వీడియో డ్రోన్ ఫుటేజ్ వరకు అన్నీ ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు సమర్పించనున్నారు. మరోవైపు, ప్రమాదం జరిగిన వాహనానికి సంబంధించి అన్ని అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షలు పోలీసులు నిర్వహించారు. అలాగే, ఘటన చోటు చేసుకున్న సమయంలో అక్కడ ఉన్న పది మంది ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు.
ఇక ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిలో వైవీ సుబ్బారెడ్డి (Y. V. Subba Reddy), పేర్ని నాని (Perni Nani), విడదల రజిని (Vidadala Rajini) సహా పలువురు ఉన్నారు. అయితే ఈ ఘటనకు ప్రధాన సంబంధిత వ్యక్తిగా భావిస్తున్న డ్రైవర్ రమణారెడ్డి విచారణకు పూర్తిగా సహకరించకపోవడం పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అతను “వీధిలో పడిన వ్యక్తిని గమనించలేకపోయాను” అని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇక ఫోరెన్సిక్ నివేదిక మరియు ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలతో పాటు డ్రైవింగ్ విషయాల్లో సమగ్రత పరిశీలన చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో వచ్చే జూలై 1వ తేదీ న కీలకమైన మలుపు తిరగనుంది . ఈ కేసు లో కోర్టు తీసుకునే నిర్ణయం రాజకీయ పరంగా గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.