High Court: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ (Manavendranath Roy) ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్(Dheeraj Singh Thakur) ఆయనతో ప్రమాణం చేయించారు. తొలుత హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వైవీఎస్బీసీ పార్థసారథి గుజరాత్ హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ బదిలీకి ఆమోదముద్ర వేస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు. హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ రాయ్‌ను పలువురు న్యాయవాదులు, బంధువులు, శ్రేయోభిలాషులు కలిసి అభినందనలు తెలిపారు.







