అమూల్ పాల వెల్లువ ప్రాజెక్ట్ ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
గుంటూరు జిల్లాలో అమూల్ పాల వెల్లువ ప్రాజెక్టును ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. అనంతరం అమూల్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ డెయిరీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అమూల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు. పాల సేకరణలో ఉన్న మహిళలకు స్వయం ఉపాధి ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. అమూల్ ద్వారా ఇప్పటికే 400 గ్రామాల్లో పాలసేకరణ చేపట్టామని తెలిపారు. గుంటూరు జిల్లాలో 180 గ్రామాల్లో పాలసేకరణకు శ్రీకారం చుట్టామని, చిత్తూరు జిల్లాలో మరో 170 గ్రామాల్లో పాలసేకరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ ప్రపంచంలోనే 8వ స్థానంలో ఉంది. అమూల్ ఒక సహకార సంస్థ అక్కచెల్లెమ్మలే వాటాదారులు. అమూల్‌తో ఒప్పందం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. అమూల్ సంస్థ లాభాలను పాడి రైతులకే తిరిగి చెల్లిస్తున్నారని తెలిపారు.






