‘భవిష్యత్తు’కే ఈ పరీక్షలు : సీఎం జగన్

కొందరు విపత్కర సమయంలోనూ అగ్గిపెట్టాలని చూస్తున్నారని ఏపీ సీఎం జగన్ ప్రతిపక్షంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహణ విషయమై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో జగన్ పై విమర్శ చేశారు. టెన్త్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‌కే నష్టమని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ విషయంలో తనకంటే ఎవరూ ఎక్కువగా ఆలోచించరని అన్నారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్‌కు భరోసా కల్పిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పలువురు విమర్శలు చేస్తున్నారని, కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ ఇలాగే చేస్తున్నారని ఫైరయ్యారు. విద్యార్థుల భవిష్యత్ సర్టిఫికెట్లపైనే ఆధారపడి ఉంటుందని, పరీక్షల నిర్వహణకు అన్ని రాష్ట్రాల్లో ఏక విధానం లేదని అన్నారు. పరీక్షలు నిర్వహించాలో వదో్ద అన్నది కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని గుర్తు చేశారు.
పరీక్షలు నిర్వహించకపోతే సర్టిఫికెట్లలో పాస్ అనే ఉంటుందని, పాస్ సర్టిఫికెట్లతో విద్యార్థులకు మంచి సంస్థల్లో సీట్లు వస్తాయా? అంటూ ప్రశ్నించారు. విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తు ఉండాలనే తాము పరీక్షలు నిర్వహిస్తున్నామని, పరీక్షలు రద్దు చేయాలని చేయడం చాలా సుభమైన పనేనని కౌంటర్ ఇచ్చారు. పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. జాగ్రత్తగా పరీక్షలు నిర్వహించడమనేది కష్టతరమైన పనేనని, పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటున్నామని మాత్రం చెప్పగలమని సీఎం జగన్ హామీ ఇచ్చారు.