కాన్సెప్ట్ సిటీలతో పెట్టుబడి వస్తుంది…

ఆంధప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి సులభంగా బాటలు వేసేలా ఉందని, రాష్ట్ర బడ్జెట్‍లో కూడా కోవిడ్ కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పారిశ్రామిక అభివృద్ధికి పలు చర్యలు తీసుకోవడంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్టీస్ (సీఐఐ) హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సహకారంతో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించే విధంగా తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రం భారీ పెట్టబడులతోపాటు ఉపాధి అవకాశాలను పొందే అవకాశముందని సీఐఐ ఏపీ చాప్టర్ చైర్మన్ డి.తిరుపతిరాజు పేర్కొన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్రం 6,234.64 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా దేశానికి షోకేస్‍గా నిలబడిందని, కాన్సెప్ట్ సిటీల నిర్మాణంతో భారీగా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించవచ్చని చెప్పారు.