Chintamaneni: వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి : చింతమనేని
ఏలూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీల్లో కొందరు (Coverts) కోవర్టులున్నారు అని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ (Chintamaneni Prabhakar,) అన్నారు. ఏలూరు (Eluru) నగరంలో నిర్వహించిన టీడీపీ ఏలూరు పార్లమెంటరీ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో చింతమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారి కారణంగా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చు. వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలి అని అన్నారు. ఇతర రాజకీయ పార్టీల (Political parties)కు చెందిన కొందరు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. వీరి విషయంలో అప్రమత్తంగా ఉండకపోతే నష్టపోవాల్సి వస్తుంది అని పేర్కొన్నారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






