Chandrababu: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై.. చంద్రబాబు కీలక నిర్ణయం

తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల (telangana public representatives) సిఫార్సుల లేఖలను అనుమతించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu) తెలిపారు. సీఎంతో బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి నాలుగు (Four a week) సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడిరచారు.