CBN: దావోస్ బయలుదేరిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందం
• గన్నవరం నుంచి ఢిల్లీకి బయలుదేరిన సీఎం చంద్రబాబు
• సీఎం చంద్రబాబు వెంట దావోస్ బృందంలో మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్
•ఢిల్లీలో రాత్రి 1.45 గంటలకు బయల్దేరి రేపు ఉదయం భారత కాలమానం ప్రకారం 11 గంటలకు జ్యూరిచ్‌కు చేరుకోనున్న చంద్రబాబు
* మధ్యాహ్నం 2.30 గంటలకు జ్యూరిచ్‌లోని స్విట్జర్లాండ్ భారతీయ రాయబారి మృదుల్ కుమార్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మర్యాద పూర్వక భేటీ.
• అనంతరం సీఎంతో సమావేశం కానున్న ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహ అధ్యక్షులు రిథిమా లుల్లా, స్వనీత్ సింగ్
* సాయంత్రం 4 గంటలకు భారత ఎంబసీ ఆధ్వర్యంలో జ్యూరిచ్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొననున్న సీఎం.
.ఈ సమావేశంలో తెలుగువారిని ఉద్దేశించి ప్రసంగించనున్న చంద్రబాబు
• డయాస్పోరా సమావేశం అనంతరం జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్‌కు సీఎం చంద్రబాబు
• దావోస్‌లో తొలిరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక, పర్యాటక విభాగాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రితో వివిధ దేశాల ప్రతినిధులతో జరిగే సమావేశంలో పాల్గొననున్న సీఎం.
• అనంతరం టాటాసన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో భేటీ కానున్న ముఖ్యమంత్రి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});






