Zurich Airport :జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో కలుసుకున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు (Sridharbabu) ఉన్నారు.