14 నుంచి సింహాచలంలో చందనోత్సవం

సింహాచలం శీశీశ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం ఈ నెల 14వ తేదీనుంచి జరగనున్నది. ఈ ఉత్సవంకోసం ఇందుకోసం రాళ్లను, చందనపు చెక్కలను సిద్ధం చేశారు. తొలి విడతగా 32 కేజీల మేలురకపు గంధపు చెక్కలను అరగదీయనున్నారు. ఏర్పాట్లను స్థానాచార్యులు, ప్రధాన అర్చకులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఆలయ దర్శన వేళలను కూడా మార్చారు. రోజూ ఉదయం 7:30 నుంచి 9:30 మధ్య భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. రెవెన్యూ, దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆదేశాలమేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రోజుకు గరిష్టంగా రెండు గంటలకన్నా ఎక్కువ సమయం భక్తులకు ఆలయంలోకి అనుమతించొద్దని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. భక్తుల సౌకర్యార్థం ఉదయం 7:30 నుంచి 9:30 వరకు అనుమతిస్తారు. కోవిడ్ ప్రొటోకాల్‍ను పూర్తి స్థాయిలో పాటిస్తూ ఈ రెండు గంటల సమయంలోనే శీశీశ్రీ వరాహలక్ష్మీన•సింహ స్వామిని దర్శించుకోవాలని ఆలయ ఈఓ , అధికారులు విజ్ఞప్తి చేశారు.