Pawan Kalyan: ఉప్పాడ తీర రక్షణకు కేంద్రం ఆమోదం.. పవన్ కళ్యాణ్ కృషికి ఫలితం

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేంద్ర ప్రభుత్వంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ప్రజల శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్న తీరు ప్రస్తుతం ప్రశంసలు పొందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో ఆయనకు ఉన్న సన్నిహిత బంధం గూర్చి చాలా మంది తెలుసు. ఆయన ఆప్యాయంగా “ఆంధీ” (Aandhi)గా పిలుచుకునే పవన్, కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులకు నిధులు తీసుకురావడంలో సఫలమవుతున్నారు.
ఇటీవల పిఠాపురం (Pithapuram) సమీపంలోని ఉప్పాడ (Uppada) బీచ్ రక్షణ కోసం కేంద్రం ఆమోదించిన ప్రాజెక్ట్ దీనికి ఉదాహరణ. ఉప్పాడ తీరప్రాంతంలో గత కొన్ని దశాబ్దాలుగా బీచ్ కోతల వల్ల వందల ఎకరాల భూమి సముద్రంలో కలిసిపోయింది. ఈ సమస్యపై గతంలో ఎన్నో మార్లు చర్చలు జరిగినప్పటికీ, అమలులోకి తెచ్చిన చర్యలు తక్కువే. అయితే, పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు ఉప్పాడలో నిర్వహించిన సభలో ఈ సమస్యను ప్రస్తావించారు. గత 100 ఏళ్లలో ఈ ప్రాంతం దాదాపు 350 ఎకరాల భూమిని కోల్పోయిందని అన్నారు.
అప్పుడు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రూ. 323 కోట్ల బడ్జెట్‌తో బౌల్డర్ వాల్ నిర్మాణానికి ఆమోదం తెచ్చారు. ఇది తీరప్రాంత భూకోతను అరికట్టే శాశ్వత పరిష్కారంగా భావించబడుతోంది. ఈ ప్రాజెక్టు వల్ల భవిష్యత్తులో తీరప్రాంత గ్రామాలు , ప్రజల ఆస్తులు రక్షించబడతాయని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత లాభాల కోసం కేంద్ర తో ఉన్న సత్సంబంధాలను స్వప్రయోజనం కోసం కాకుండా ప్రజల కోసం , రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాల్లో మాత్రం ఆయన ఉపయోగిస్తున్న తీరు ఇప్పుడు ప్రజల్లో విశ్వాసం పెంచుతోంది. రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉండి, తన పరిధిలోని బాధ్యతను నిశ్శబ్దంగా నిర్వర్తిస్తున్న పవన్‌కు ప్రజల్లో గౌరవం పెరుగుతోంది.
ఈ ప్రాజెక్ట్ ఒక చారిత్రాత్మక చర్యగా నిలవనుంది. రాష్ట్రం తరపున పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చురుకైన నిర్ణయాలు, కేంద్రం నుంచి సహకారం పొందడంలో చూపుతున్న నైపుణ్యం మరిన్ని అభివృద్ధి అవకాశాలకు దారి తీసేలా ఉన్నాయి. ఇప్పటివరకు కూటమిలో భాగంగా ఎదుగుతున్న జనసేనకు పవన్ నాయకత్వం కొత్త దిశా నిర్దేశం చేస్తుంది.