Ahmedabad: విమాన ప్రమాదంపై చంద్రబాబు, రేవంత్ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై తెలుగు రాష్ట్రాల సీఎంలతో పాటు పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుజరాత్ అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం కూలిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో దానిలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. విమాన ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. ప్రయాణికులు , సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. విమానం ప్రమాదానికి గురువడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. క్షతగాత్రులను ఆదుకునేందుకే కేంద్ర ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని కోరారు. ఈ విమానం ప్రమాదంపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR), ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) , మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.