Yamini : చంద్రబాబు విజన్ వల్ల ఏపీ అభివృద్ధి : యామినీశర్మ
 
                                    మోదీ ప్రభుత్వ పాలసీలు, సంస్కరణలు, రాయితీల వల్ల దేశానికి పెద్ద పెత్తున పెట్టుబడులు వస్తుంటే కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతోందని, చంద్రబాబు (Chandrababu) విజన్ వల్ల ఏపీ అభివృద్ధి చెందుతుంటే అడ్డుకోవడానికి వైసీపీ (YCP) కుట్రలు పన్నుతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీశర్మ(Yamini Sharma) విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థిరత్వం లేక ప్రాజెక్టులను కోల్పోతోందని, అవినీతిలో కూరుకుపోయిన ఆ పార్టీ నాయకులు ఏపీలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్డీయే పాలకుల విజన్ వల్ల విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ (AI Data Center) వచ్చిందన్నారు. ఇన్నాళ్లూ ప్రతిపో హోదా కావాలని గోల చేసిన జగన్, తుపానుతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు.











 
                                                     
                                                        