ఏపీ ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు

ఏపీలో కరోనా స్వైర విహారం చేస్తోంది. ఈ నేపథ్యంలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్లో మార్పులు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 8 గంటల నుంచి 11:30 గంటల వరకే పనిచేస్తాయని ఓ ప్రకటనలో పేర్కొంది. సచివాలయం, అన్ని శాఖల హెచ్‌వోడీలు, జిల్లా కార్యాలయాలు, సబ్ డివిజనల్ కార్యాలయాల పనివేళల్లో మార్పులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే 12 గంటల తర్వాత పనిచేసే వారు మాత్రం కచ్చితంగా పాసులు తీసుకోవాలని ఆదేశించింది. అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు ఉంటుందని జగన్ సర్కార్ ప్రకటించింది.