ఆ పిల్లలకు రూ.10 లక్షల డిపాజిట్ ..ఏపీ ప్రభుత్వం

కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయి అనాథలైన పిల్లల సంరక్షణ కోసం రూ.10 లక్షలను ఆంధప్రదేశ్ ప్రభుత్వం జాతీయ బ్యాంక్‍లో డిపాజిట్ చేసే నిమిత్తం వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. 18 ఏళ్లలోపు వయస్ను వారు ఇందుకు అర్హులుగా పేర్కొంది. తల్లిదండ్రుల్లో ఒకరు అంతకుముందే చనిపోయినప్పటికీ ఈ పథకం వర్తిస్తుంది. బాధిత కుటుంబానికి పీడీఎస్ కార్డు ఉండాలి. చనిపోయిన వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నివేదిక ఉండాలి ఇతర బీమా సౌకర్యం ఉండకూడదు. అర్హతలు గుర్తించి ఆమోదించేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‍గా ఏర్పాటు చేసిన కమిటీలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సభ్యులుగా ఉంటారు. రూ.10 లక్షలు డిపాజిట్ చేసి, పిల్లలకు వడ్డీ పొందే అవకాశాన్ని కల్పిస్తారు. 25 ఏళ్లు నిండిన తర్వాత మాత్రమే డబ్బు విత్‍డ్రా చేసుకొనే అవకాశం కల్పిస్తారు.