Minister Narayana: రాజధాని రైతులకు శుభవార్త :మంత్రి నారాయణ
రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిని త్వరగా అభివృద్ధి చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాయణ ( Narayana) తెలిపారు.తుళ్లూరు (Thullur) మండలం వడ్డమానులో రెండో విడత భూ సమీకరణ ప్రక్రియను ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. మూడేళ్లలో అంతర్జాతీయ విమానాశ్రయం, క్రీడా ప్రాంగణం పూర్తి చేయాలని సీఎం చెప్పారన్నారు. రాజధాని ప్రాంత రైతులకు రుణమాఫీ చేయాలని ఎమ్మెల్యే శ్రావణకుమార్ (Sravankumar) కోరారన్నారు. ఇప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో మాట్లాడనని దానికి ఆయన అంగీకరించారని చెప్పారు. ఈ నెల 6 తేదీ వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని మంత్రి ప్రకటించారు. రూ.1.50 లక్షల వరకు దీన్ని వర్తింపజేస్తామని తెలిపారు.






