us: అమెరికా, ఇజ్రాయెల్ కు అబ్రహం అకార్డ్ ఎందుకంత ప్రత్యేకం..?
అబ్రహం అకార్డ్ లేదా అబ్రహం ఒప్పందం గల్ఫ్ ప్రపంచంలో అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలకు అత్యంత కీలకం. అరబ్ దేశాలతో, ముఖ్యంగా సున్నీ ముస్లిం దేశాలతో సంబంధాలను సాధారణీకరించడానికి ఇజ్రాయెల్‌కు సహాయపడుతుందని డోనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై అధిక శ్రద్ధ చూపుతున్నారు. ఈ ఒప్పందం 2020లో ఇజ్రాయెల్ … యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, మొరాకో, సూడాన్ మరియు బహ్రెయిన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం. ఈ గల్ఫ్ దేశాలు …ఇజ్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించడంలో ఈ ఒప్పందం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఇజ్రాయెల్ తో ఇప్పటివరకూ తమ సంబంధాలను మెరుగుపరుచుకున్న రెండు దేశాలు యుఎఇ మరియు బహ్రెయిన్ మాత్రమే….
అబ్రహం ఒప్పందం కారణంగా… గల్ఫ్ దేశాలు, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. 26 ఏళ్లకు పైగా ఇజ్రాయెల్, అరబ్ దేశాల మధ్య కుదిరిన తొలి ఒప్పందమిది. అతి పెద్ద, ప్రభావ వంతమైన సౌదీ అరేబియాతో సంబంధాలను మరింత బలోపేతం చేయడం దిశగా ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా ఎఫ్-35 యుద్ధవిమానాలను సరఫరా చేస్తూ.. నెమ్మదిగా అమెరికా -సౌదీ మధ్య బంధాన్ని మరింత దృఢతరం చేయాలన్నది ట్రంప్ ఆలోచనగా కనిపిస్తోంది.
అబ్రహం ఒప్పందాలు త్వరలో విస్తరించే అవకాశం ఉందని అధ్యక్షుడు ట్రంప్ ఇటీవలి వారాల్లో పదే పదే చెబుతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు మరిన్ని దేశాలను ఒప్పందంలోకి స్వాగతించడానికి సిద్ధంగా ఉందని సంసిద్ధత వ్యక్తం చేశారు.మరో ముస్లిం మెజారిటీ దేశమైన మౌరిటానియా త్వరలో అబ్రహం ఒప్పందాలలో చేరవచ్చు, ఇది 2020లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి పదవీకాలంలో ప్రారంభమైన ప్రధాన శాంతి ఒప్పందం. ఇది జరిగితే, ఒప్పందంలో ముస్లిం దేశాల సంఖ్య ఐదుకు పెరుగుతుంది. అబ్రహం ఒప్పందాలు కొన్ని ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను సాధారణీకరించడానికి అంగీకరించిన మొదటిసారి. ఇప్పటివరకు, యుఎఇ, మొరాకో, బహ్రెయిన్ మరియు సూడాన్ చేరాయి. పాలస్తీనాతో దీర్ఘకాలంగా ఉన్న వివాదం కారణంగా అనేక ముస్లిం దేశాలు ఇజ్రాయెల్‌తో సంబంధాలను నివారించినందున దీనిని ఒక పెద్ద అడుగుగా భావించారు.
ఇప్పుడు ఇజ్రాయెల్ మరియు దాని మిత్రదేశమైన అమెరికాకు మరింత ముఖ్యమైనదిగా మారింది.
వాయువ్య ఆఫ్రికాలోని ఒక దేశమైన మౌరిటానియా, బుధవారం వైట్ హౌస్‌లో ఇజ్రాయెల్‌తో సమావేశమైనందున ఐదవ దేశంగా అబ్రహం ఒప్పందాలలో చేరే అవకాశం ఉందని ప్రపంచ వార్తా వేదిక అయిన సెమాఫోర్ తెలిపింది. ముఖ్యంగా, మౌరిటానియా 2010లో ఇజ్రాయెల్‌తో అన్ని రకాల సంబంధాలను తెంచుకుంది. ఇది జరిగితే గల్ఫ్ ప్రపంచంలో పెనుమార్పులు చోటు చేసుకోవచ్చని తెలుస్తోంది.






