Revanth Reddy: ఢిల్లీకి రేవంత్ రెడ్డి … సంచలన నిర్ణయాలు ఉండబోతున్నాయా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ వెళ్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ (Congress high command) ఢిల్లీలో ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు పార్టీ వ్యవహారాలతో పాటు ప్రభుత్వ విషయాలను కూడా అక్కడికెళ్లి వివరించడం కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు (Congress Chief Ministers) అలవాటే. అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీ (Delhi Tour) వెళ్తున్నారు. అయితే ఈసారి పర్యటన మాత్రం కాస్త వాడీవేడిగా ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఇంటాబయటా అసంతృప్తి కనిపిస్తోంది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తిగా ఉండడంపైనే ఎక్కువ ఫోకస్ కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుంది. తాము ఇచ్చిన గ్యారంటీలను (Six guarantees) అమలు చేశామని ఆయన ప్రభుత్వం చెప్తోంది. అందుకో స్థానిక సంస్థల ఎన్నికలకు (Local body elections) వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇందుకోసం పార్టీ కేడర్ ను సమాయత్తం చేసేందుకు MCHRDలో పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుకోసం కేడర్ కు దిశానిర్దేశం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా కులగణనను (caste census) ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ చెప్తోంది. ఏ ప్రభుత్వమూ చేయని కులగణను తాము చేసినా దాన్ని చెప్పుకోవడంలో విఫలమయ్యామనే భావన్ కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. దీన్ని విస్తృతంగా తీసుకెళ్లాలనుకుంటోంది.
అయితే కులగణనపై సొంతపార్టీ ఎమ్మెల్సీ అయిన తీన్మార్ మల్లన్న (MLC Teenmar Mallanna) లాంటి వాళ్లు విమర్శలు గుప్పించడం పార్టీకి సమస్యగా మారింది. మరోవైపు రేవంత్ కేబినెట్లోని (Revanth Cabinet) కొందరు మంత్రుల తీరు ఆక్షేపణీయంగా ఉందని పార్టీ ఎమ్మెల్యేలు కొందరు ఇటీవల రహస్యంగా సమావేశమై చర్చించారు. వీళ్లంతా హైకమాండ్ ను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేయాలని నిర్ణయించుకున్నారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) బెంగళూరులో పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను కలిసి అసంతృప్తి తెలియజేసినట్లు సమాచారం. పార్టీలో జరుగుతున్న పరిణామాలను ఆయన వివరించినట్లు తెలుస్తోంది. ఇలాంటివన్నీ రేవంత్ రెడ్డికి ఇబ్బందికరంగా మారాయి.
కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డిపై పలువురు నేతలు మాటల తూటాలు ఎక్కుపెట్టేవారు. కానీ ఆయన సీఎం అయ్యాక అందరి నోళ్లూ మూతపడ్డాయి. అయితే ఇప్పుడు కొందరు నేతలు రేవంత్ రెడ్డిపై కాకుండా ఆయన టీంపైన అసంతృప్తిగా ఉండడం ఆయనకు సమస్యగా మారింది. రేవంత్ రెడ్డికి హైకమాండ్ ఫుల్ సపోర్టివ్ గా ఉంది. అయినా రాష్ట్రంలో పార్టీని చక్కబెట్టాల్సిన బాధ్యత సీఎంతోపాటు పీసీసీ చీఫ్ (PCC Chief) పైన ఉంటుంది. అందుకే ఈ వ్యవహారాలను పార్టీ హైకమాండ్ సీరియస్ గా పరిగణించి రేవంత్ రెడ్డికి క్లాస్ పీకే అవకాశం ఉందని భావిస్తున్నారు.