Congress: మహారాష్ట్ర ఎన్నికలు.. కాంగ్రెస్‌కు దక్కని విజయం

పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమైంది. వరుసగా మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గొప్పగా లేదు. ప్రాంతీయ పార్టీలతో కలిసి కొన్ని చోట్ల ప్రభుత్వంలో భాగస్వాములవుతున్నా కాంగ్రెస్ ఒంటరిగా నిలిచిన స్థానాలు తక్కువే. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిరది..? ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కూటమి ఓడిపోవడం ఆ పార్టీకి దెబ్బగానే చెప్పవచ్చు. కాకపోతే కేరళ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ గెలవడం ఆ పార్టీకి కొంత ఊరటను కలిగించింది. బీజేపీ రోజురోజుకూ బలం పుంజుకుంటూనే వెళ్తోంది. 2019లో సొంతంగా మెజారిటీ సీట్లు సాధించిన బీజేపీ 2024 నాటికి మిత్రపక్షాలపై ఆధారపడాల్సి వచ్చింది. దీంతో బీజేపీ పనైపోయిందని.. ఇక కాంగ్రెస్ బలోపేతం అవుతుందని అందరూ ఆశించారు. అయితే తాజాగా మహారాష్ట్ర, రaార్ఖండ్ ఎన్నికల్లో అది తప్పని నిరూపణ అయింది. రaార?ండ్ లో జేఎంఎం ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి అయింది. మహారాష్ట్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది.
ఉపఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. అయితే ఇవన్నీ తాము అధికారంలో ఉన్న రాష్ట్రాలు లేదంటే తమ సీట్లే కావడం విశేషం. అంతేకానీ మరో పార్టీని ఓడిరచి పాగా వేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ.. ఇలా హేమాహేమీలు కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోతోంది. ఒంటరిగా వెళ్తే ఉపయోగం ఉండట్లేదని భావించి మిత్రపక్షాలతో కలిసి వెళ్తోంది. అయినా ప్రయోజనం ఉండట్లేదు. ఈవీఎంల వల్లే తాము ఓడిపోతున్నామని ఇప్పుడు చెప్తోంది. అయితే గెలిస్తే ఈవీఎంలపై నెపాన్ని వేయకుండా.. ఓడినప్పుడు మాత్రమే ఇలా మాట్లాడడాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికో విధంగా తమ విధానాలను మార్చుకోవాల్సి వస్తోంది. దేశవ్యాప్తంగా ఒక సిద్ధాంతాన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు దేశస్థాయిలో అదానీని రాహుల్ గాంధీని ఎండగడుతున్నారు. అదే సమంయలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అదానీతో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. విపక్షాలు దీన్ని అస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యగా మారింది. ఇలాంటివి ప్రతి రాష్ట్రంలోనూ ఉన్నాయి. అంతేకాక మిత్రపక్షాల ఒత్తిళ్లకు తలొగ్గి అణిగమణిగి ఉండాల్సి వస్తోంది. ఇది కూడా పార్టీ బలహీన పడడానికి మరో కారణం. మరోవైపు బీజేపీ ఎప్పటికప్పుడు నేషన్ ఫస్ట్ అనే నినాదంతో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా అంతర్గత సమీక్ష చేసుకోకుండా ఇలాగే ముందుకెళ్తే మున్ముందు కూడా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉండొచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా..
ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్‌కు కష్టాలు తప్పడం లేదు. ఆ పార్టీ ఆర్భవించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ హవా అంతా ఇంత కాదు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన ముఖ్యమంత్రుల లిస్ట్ తీసుకున్న ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. అంతెందుకు చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి లాంటి రాజకీయ ఉద్దండులు వచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే. తెలుగు రాష్ట్రాలలో అంత చరిత్ర కలిగిన కాంగ్రెస్ క్రమేపి కనుమరుగైపోతోంది.
ఒకరకంగా తెలంగాణలో పుంజుకున్న కాంగ్రెస్ ఆంధ్రాలో మాత్రం తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకునే పరిస్థితిలు కనిపించడం లేదు. ఆంధ్రాలో కాంగ్రెస్ భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తులో పార్టీ పుంజుకునే అవకాశం ఉందా? అనేది ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని కష్టపడుతున్న నాయకులకు ప్రశ్నార్థకంగా మారింది. మరి ముఖ్యంగా మహారాష్ట్ర ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు అయోమయంగా ఉన్నాయి. ఓటు బ్యాంకు విషయంలో కాంగ్రెస్ ఇంకా పుంజుకోవాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ భవిష్యత్తును నిలబెడుతుంది అనే ధీమాతో బరిలోకి దింపిన షర్మిల ఎంతసేపు ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడతారే తప్ప పార్టీ గురించి ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. 2024 ఎన్నికల సమయంలో కూడా జగన్ కి ఓటు వేయొద్దు అనే ప్రచారానికి ఇచ్చిన ప్రాముఖ్యత కాంగ్రెస్ కి ఓటు వేయించాలి అనేదానికి ఇవ్వలేదు అన్న విమర్శలు ఉండనే ఉన్నాయి.
ప్రస్తుతం పార్టీ చీఫ్‌గా ఉన్న షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్‌ని బలోపేతం చేసే విధంగా అడుగులు వేయడం లేదు అనేది సీనియర్ నేతల మాట. ఆమె సొంత అజెండా వదలకపోవడం.. పార్టీ డెవలప్మెంట్ చేయడానికి ఎటువంటి ప్రయత్నం చేయకపోవడంతో ఆంధ్రాలో పరిస్థితులు మరింత దారుణంగా మారుతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఆరు మాసాలు గడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేరువయ్య విధంగా ఎటువంటి కార్యక్రమాలు ప్రారంభించలేదు.
ప్రభుత్వ విధి విధానాలు, నెరవేర్చాల్సిన హామీలు, ప్రజలకు అందిస్తున్న మౌలిక వసతులు.. ఇలా ఏదో ఒక పాయింట్ తో ప్రభుత్వాన్ని ప్రశ్నించి ప్రజల దృష్టిని తమ వైపు ఆకర్షించే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో ఏ ప్రోగ్రాం నిర్వహించలేదు. ఇదే కొనసాగితే పరిస్థితులు మరింత దారుణంగా మారుతాయి అని హెచ్చరిస్తున్నారు పార్టీ ప్రముఖులు. మహారాష్ట్ర ఫలితం చూసిన తర్వాత అయినా ఆంధ్రాలో మార్పు రావలసిన అవసరం ఉంది అని రఘువీరా చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మరోపక్క షర్మిల ను నమ్ముకుంటే ఆంధ్రాలో కాంగ్రెస్కి భవిష్యత్తు ఉండదు అన్న మాట కూడా బలంగా వినిపిస్తోంది. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.