Pakistan: పాక్ లో యుద్ధభయం.. దేశం విడిచి పోతున్న ప్రముఖుల కుటుంబాలు

పహల్గాం దాడితో యావత్ భారతం ఆగ్రహానికి గురైంది. 140 కోట్ల మంది ప్రజలు .. పాకిస్తాన్, పహల్గాం ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పాలని కోరుతున్నారు. ఈపరిస్థితిలో కేంద్రంపై ఒత్తిడి పెరిగిపోతోంది. దీంతో ఉగ్రదాడికి తగిన ఫలితం తప్పదని .. ప్రపంచదేశాల సాక్షిగా పాకిస్తాన్ (Pakistan) ను ప్రధాని మోడీ (Modi) హెచ్చరించారు. దీనిలో భాగంగా పాకిస్తాన్ తో అన్నిరకాల సంబంధాలను తెంచుకునే దిశగా అడుగులేస్తున్నారు.సింధూ జలాలను నిలిపివేస్తామని హెచ్చరించడంతో పాటు దౌత్యపరమైన ఆంక్షలు విధించారు.
అయితే ఇది ఇక్కడితో ఆగేలా లేదని పాకిస్తాన్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఓవైపు భారత్ ను హెచ్చరిస్తూ ప్రకటనలు చేయడమే కాదు.. ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. యుద్ధ భయంతో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ దగ్గర నుండి బిలావల్ భుట్టో వరకు వారి కుటుంబాలు దేశం విడిచి వెళ్లిపోతున్నాయి.వారితో పాటు, పాక్ జాయింట్ చైర్‌పర్సన్ షంషాద్ మీర్జాతో సహా అనేక మంది ముఖ్య అధికారుల కుటుంబాలు దేశం విడిచి వెళ్లినట్లు సమాచారం.
మరోవైపు.. పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రస్తుతం భారత్ తో యుద్ధానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ ఆర్మీపై దాడులు చేస్తోంది.మరోవైపు తెహ్రీక్ ఏ తాలిబాన్ అయితే… నేరుగా పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ పైనా ఎటాక్స్ చేసి, సైనికులను చంపేస్తోంది. ఈపరిణామాలతో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వర్తించాలంటేనే సైనికులు భయపడుతున్నారు. అవసరమైన రాజీనామా చేస్తాం కానీ… అక్కడ విధులు నిర్వర్తించలేమంటున్నారు. అవసరమైతే పాకిస్తాన్ ఆర్మీ విధించే శిక్షలకు కూాడ సిద్ధమంటున్నారు.