రోజా ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేటిజన్స్.. వైరల్ అవుతున్న వీడియో..

ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి.. ఆఱ్కే రోజా.. ఒకప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత వైరల్ లో అందరికీ తెలుసు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రోజా తనదైన శైలిలో బాగా వైరల్ అయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో రోజా పెద్దగా కనిపించడం లేదు. మళ్లీ తిరిగి ఇప్పుడు సరికొత్తగా మరొకసారి ఆమె సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు .
తమిళనాడులోని తిరుచ్చెందూర్ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించిన రోజా అక్కడ ప్రవర్తించిన తీరుపై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం ఆలయంలో భర్త సెల్వమణి స్వామి తో కలిసి రోజా స్వామి వారి అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె కోసం వచ్చిన అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఆమెను చూడడానికి వచ్చిన శుద్ధ కార్మికుల పట్ల ఆమె ప్రవర్తించిన తీరు అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది సినిమా యాక్టర్ తో కలిసి సెల్ఫీ తీసుకోవాలి అనే ఆనందంతో ఆమె దగ్గరకు వచ్చిన పారిశుద్ధ్య కార్మికులను.. దూరం జరిగిన నేర్చుకోవాలని రోజా సైగలు చేయడం వీడియోలో క్లియర్గా రికార్డు అయింది. దీంతో మాజీ మంత్రి రోజా ప్రజల పట్ల ప్రవర్తిస్తున్న తీరు పై సోషల్ మీడియాలో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. 'పారిశుద్ధ్య కార్మికులంటే అంత చిన్నచూపా' అంటూ ఈ వీడియో చూసిన కొందరు మండిపడుతున్నారు.
తనతో సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన అధికారులు, అర్చకులతో రోజా ప్రవర్తించిన తీరుకి.. పారిశుద్ధ్య కార్మికులతో ఆమె ప్రవర్తించిన తీరుకి మధ్య ఎంతో తేడా కనిపిస్తోంది. మొదట్లో వారిని దగ్గరికి రావద్దు అని సైగ చేసినప్పుడు అందరితో ఫోటోలు దిగాక వారితో విడిగా దిగుతారు అని అనుకున్నారు. కానీ ఫోటో సెక్షన్ పూర్తయిన తర్వాత వారితో ఫోటో దిగడానికి నిరాకరించి రోజా అక్కడ నుంచి వెళ్లిపోయారు.ఈ నేపథ్యంలో శ్రామిక శక్తిని గౌరవించడం చేతకాని వారికి రాజకీయంలో ఉండడానికి అర్హత లేదు అన్న వాదన కూడా సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తోంది.