Washington: ద అమెరికా పార్టీ.. ఎలన్ మస్క్ పార్టీ వచ్చేసింది..

అమెరికా రాజకీయ చరిత్రలో మరో పార్టీ ప్రారంభమైంది. ద అమెరికా పార్టీ అని దేశం పేరుతో పార్టీ పేరు పెట్టాడు. మస్క్ ఎంత అడ్డుకున్నా.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు మాత్రం ఆగలేదు. శుక్రవారం వైట్ హౌస్‌లో జరిగిన 249వ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ట్రంప్ తన కలల బిల్లుపై సంతకం చేశారు. దీంతో బిల్లు అమల్లోకి వచ్చింది. బిల్లు అమల్లోకి రావటంతో .. మస్క్ ముందు చెప్పినట్లుగానే కొత్త పార్టీని ప్రారంభించాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు.
‘మన దేశాన్ని నష్టాలలోకి నెట్టే వృధా ఖర్చులు, అవినీతి.. ఇవన్నీ చూస్తుంటే.. మనం ప్రజాస్వామ్యంలో కాకుండా ఒక పార్టీ పాలనలో ఉన్నట్టు ఉంటుంది. మీ స్వేచ్ఛను మళ్లీ మీకు అందించడానికి ఈ రోజు అమెరికా పార్టీ ఏర్పడింది. ఇదే మీకు కావలసిన కొత్త రాజకీయ పార్టీ’ అని పేర్కొన్నాడు మస్క్. అయితే రిపబ్లికన్లు లేదంటే డెమొక్రాట్ల పాలనలో ఉంటూ వస్తున్న అమెరికన్లకు.. ఈ పార్టీపై కాస్త మక్కువ ఉన్నట్లే కనిపిస్తోంది. దీంతో తాము ఆ రెండు పార్టీలకు గట్టిబుద్ది చెబుతామని భావిస్తున్నాడు ట్రంప్
ప్రస్తుతం ఉన్న రెండుపార్టీలను అమెరికన్లు నిశితంగా గమనిస్తున్నారు. ఒకటి ట్రంప్ నేతృత్వంలోని ద గ్రాండ్ ఓల్డ్ పార్టీ రిపబ్లికన్(GOP) పార్టీ.. ఈ పార్టీ ప్రస్తుతం పూర్తిగా ట్రంప్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తోంది. ఇందులో మరో వ్యక్తి అభిప్రాయానికి కూడా చోటు లేకుండా పోయింది. గతంలో అధ్యక్షులుగా ఉన్న వారు, ఘనత వహించిన అధ్యక్షులు కూడా ఏదైనా నిర్ణయం తీసుకునేముందు.. సీనియర్లతో పూర్తిగా చర్చించేవారు. వారిచ్చిన సూచనలు, సలహాలు అవసరమైతే తీసుకునేవారు. కానీ ట్రంప్ పాలనలో అది లేకుండా పోయిందని చెప్పవచ్చు.
డెమొక్రాటిక్(Democratic) పార్టీలో ఇప్పుడు వృద్ధనేత, మాజీ అధ్యక్షుడు జో బైడన్ ఉన్నారు. ఆయనపై జనానికి నమ్మకమున్నప్పటికీ… ఆయన ఆరోగ్యంపై సందేహాలున్నాయి. వాటిని నిజం చేస్తూ.. ఆయన పలుమార్లు గందరగోళ పడుతూ పబ్లిగ్గా కనిపించారు కూడా. ఇక మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్.. నిజంగా సామర్థ్యం కలిగిన వ్యక్తి అయినప్పటికీ.. ఆమెకు కొన్ని అంశాల్లో పట్టులేదన్నది సగటు అమెరికన్ అబిప్రాయం. అందుకే.. గత ఎన్నికల్లో బైడన్ స్థానంలో పోటీకి వచ్చినా.. పార్టీని గెలిపించలేకపోయారు. ప్రస్తుతం ఇరుపార్టీల మీద జనం నమ్మకం సడలినట్లు కనిపిస్తోంది. దీంతో తమ పార్టీకి మంచి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు మస్క్..