KEJRIWAL: హస్తిన మా అడ్డా.. సింగిల్ గా పోటీ చేస్తామన్న కేజ్రీవాల్

ఇండియా కూటమికి వరుసగా దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘోర వైఫల్యం నుంచి కోలుకోకముందే.. మిత్రపక్షం ఆప్(AAP).. కాంగ్రెస్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(delhi elections) అన్ని నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులే పోటీ చేస్తారని తేల్చి చెప్పారు ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్. ఇండియా కూటమితో కలిసి పోటీ చేయడం అనే ఆలోచననే తమ పార్టీకి లేదన్నారు. రాజకీయంగా ఈ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
గతంలో పంజాబ్ లోక్‌సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌తో కలిసి పనిచేయడానికి ఆప్ నిరాకరించింది. ఇప్పుడు అదే విధానాన్ని ఢిల్లీలో కొనసాగించబోతుందని తెలుస్తోంది. ఇక ఢిల్లీ కాంగ్రెస్(DELHI CONG) ఇప్పటికే తమ అభ్యర్థులతోనే బరిలోకి దిగుతామని స్పష్టం చేయడంతో, అటు కాంగ్రెస్ – ఆప్ మధ్య రాజకీయ సమన్వయం లేకపోవడం బయటపడింది.ఇది కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.
కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే బీజేపీని ఎదుర్కోవడంలో బలంగా ఉంటారని భావించిన వర్గాలకు ఈ ప్రకటన షాకింగ్‌గా మారింది. ఢిల్లీలో ఆప్ ఒంటరిగా పోటీ చేయడం, కాంగ్రెస్ కూడా అదే విధానాన్ని అనుసరించడం బీజేపీకి లాభసాటిగా మారుతుందా లేదా అనే దానిపై రాజకీయ విశ్లేషకులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఢిల్లీపై తన పట్టు చాటేందుకు కేజ్రీవాల్ తీసుకున్న ఈ వ్యూహం ఏ మేరకు విజయవంతం అవుతుందో వేచిచూడాలి.