విప్రో శుభవార్త.. వచ్చే మార్చి నాటికి భారీ స్థాయిలో
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన విప్రో భారీ స్థాయిలో ఉద్యోగులను నియమించుకోవడానికి రెడీ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 38 వేల మంది ప్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధమవుతున్నది. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా సీఈవో థిర్రీ డెలాపోర్ట్ మాట్లాడుతూ వచ్చే మార్చి నాటికి 38 వేల మంది ప్రెషర్లను తీసుకోనున్నట్లు తెలిపారు. వలసలు భారీగా పెరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తున్నదని, దీనిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ప్రతి మూడు నెలలకొకసారి సిబ్బందికి ప్రమోషన్లు కలిస్తున్నట్లు, అలాగే ఈ సెప్టెంబర్లో వేతనాలు పెంచబోతున్నట్లు తెలిపారు. తొలి త్రైమాసికంలో సంస్థ నికరంగా 15 వేల మందిని తీసుకోగా, వీరిలో 10 వేల మంది ఫ్రెషర్లే. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,58574కి చేరింది.






