ఆ రూల్స్ రాజ్యాంగ విరుద్ధం … వాట్సాప్

కేంద్రం, సోషల్ మీడియా సంస్థల మధ్య కొంతకాలంగా కొనసాగుతోన్న వివాదం కొత్త మలుపు తీసుకొంది. కాంప్లియన్సీ విషయంలో కేంద్ర ఇచ్చిన గడువు పూర్తవడంతో సోషల్ మీడియా సంస్థలు తక్షణమే అన్ని వివరాలతో స్పందించాలని కేంద్రం మరోసారి అల్టిమేటం జారీ చేసింది. దేశంలో అమలవుతోన్న ఐటీ చట్టాలను అనుసరించి ఆదనపు సమాచారం కావాలని అడిగే హక్కు కేంద్రానికి ఉందని పేర్కొంది. ఈ మార్గదర్శకాలపై వాట్సాప్ సంస్థ కోర్టుకెక్కింది. ఎన్‍క్రిఫ్టెడ్ మెసేజ్‍ల వివరాలను బహిర్గతపరచడం వినియోగదారుల ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసచింది. స్పందించిన కేంద్రం.. కొత్త డిజిటల్ నిబంధనలు, వ్యక్తిగత సమాచార గోప్యతకు వ్యతిరేకం కాదని, దేశ భద్రత, సార్వభౌమత్వం అంశాల్లో మాత్రమే కొన్ని మెసేజ్‍లను పరిశీలించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.