Kishan Reddy: అసలు పీవోకేను పాకిస్థాన్‌కు ఎవరు ఇచ్చారు? : కిషన్ రెడ్డి

భారత సైన్యం విజయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తక్కువ చేసి మాట్లాడటం దుర్మార్గమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సైన్యం విజయాన్ని దేశమంతా పండుగ చేసుకుంటుంటే రేవంత్‌రెడ్డికి అది బీజేపీ కార్యక్రమం (BJP program) గా కనిపిస్తుందా అని మండిపడ్డారు. మన ఎంపీలు పార్టీలను పక్కన పెట్టి ప్రపంచమంతా తిరుగుతున్నారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రపంచానికి చెబుతున్నారు. అసలు పీవోకేను పాకిస్థాన్ (Pakistan) కు ఎవరు ఇచ్చారు. కాంగ్రెస్ కారణంగానే పీవోకే అంశం రావణ కాష్టంగా రగులుతూనే ఉంది. ఉగ్రవాదులు దాడి చేస్తే గత కాంగ్రెస్ ప్రభుత్వాల్లాగా సంతాపాలతో సరిపుచ్చుకోలేదు. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్ చేసింది మోదీ (Modi) సర్కారు. పహల్గాం దాడి తర్వాత పాకిస్థాన్‌కు ఎలా నరకం చూపించామో ప్రపంచం చూసింది అని అన్నారు.