హైదరాబాద్ టు నాసిక్ స్పైస్‌జెట్
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ హైదరాబాద్ నుంచి మరిన్ని రూట్లకు కొత్త సర్వీసులను ఆరంభించబోతున్నది. ఉడాన్ స్కీంలో భాగంగా నాసిక్‌కు ఈ నెల 22 నుంచి రోజువారి సర్వీసును అందుబాటులోకి తీసుకొస్తున్నది. హైదరాబాద్‌లో ఉదయం 6.20 గంటలకు బయలుదేరనున్న స్పైస్‌జెట్ విమాన సర్వీసు నాసిక్‌కు 7.50 కి చేరుకోనున్నది. తిరుగు ప్రయాణంలో ఉదయం 8:10 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 9:40 గంటలకు చేరుకోనున్నది. ఈ నెల 17 నుంచి హైదరాబాద్-జమ్ముకు విమాన సర్వీసులు ఆరంభిస్తున్నది. అలాగే వచ్చే నెల 4 నుంచి ఢిల్లీ -హైదరాబాద్‌కు వారానికి మూడు రోజులపాటు మరో విమాన సర్వీసును నడుపనున్నట్లు ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కొత్తగా వివిధ గమ్యస్థానాలకు ప్రారంభించిన సేవలకు బుకింగ్‌లను చేపట్టింది.






