ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షో ప్రారంభం

దేశ వాణిజ్య రాజధాని ముంబయి నగరంలో ఆసియాలో అతిపెద్ద ట్రావెల్ ట్రేడ్ షో ప్రదర్శన ప్రారంభమైంది. నగరంలోని బీకేసీలో గల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటరులో ఓటీఎం ముంబయి పేరిట ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. దేశ, విదేశాలకు చెందిన పర్యాటక వ్యాపార సంస్థలు ఇందులో తమ స్టాళ్లను పెట్టాయి. భారత్‌తో పాటు మొత్తం 60 దేశాలకు చెందిన 1,300 స్టాళ్లు ఇక్కడ ఉన్నాయి. దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా పర్యాటక వ్యాపార అభివృద్ధి కోసం ఏటా ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. ఫిబ్రవరి 10వ తేదీ దాకా ఈ ట్రేడ్ షో కొనసాగనుంది.